Flash: రేపు కేసీఆర్ అధ్యక్షతన తెరాస పార్లమెంటరీ పార్టీ సమావేశం

Teresa Parliamentary Party meeting chaired by KCR tomorrow

0
85

రేపు (ఆదివారం) మధ్యాహ్నం టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం ఒంటి గంటకు ఈ భేటీ జరగనుంది.  ఈ సమావేశానికి రాజ్యసభ్య, లోక్‌సభకు చెందిన టీఆర్‌ఎస్ ఎంపీలతో సీఎం కేసీఆర్ భేటీ అవుతారు. ఫిబ్రవరి 1 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానుండగా..లోక్‌సభ, రాజ్యసభల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాన్ని సీఎం ఖరారు చేయనున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, కేంద్రం నుంచి సాధించాల్సిన పెండింగ్ సమస్యలపై ఎంపీలకు నివేదికలు అందజేయనున్నారు.