ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు తాజాగా జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు, ఓ టీషాపు దగ్గర ఉన్న ఇద్దరు పోలీసులపై ఉగ్రవాది కాల్పులు జరిపాడు, బఘాట్ ప్రాంతంలోని టీస్టాల్ దగ్గర ప్రజలు అందరూ చూస్తుండగానే పోలీసులపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ దారుణమైన ఘటనలో పోలీసులు ఇద్దరు చనిపోయారు..
ఇక్కడ ఆ ముష్కరుడు తుపాకీని కనిపించకుండా దాచుకుని వచ్చాడు… కాల్పులు జరిపి వేగంగా అక్కడ నుంచి పారిపోయాడు
ఇక ఆ ఉగ్రవాది జరిపిన కాల్పులు ఇక్కడ సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి… వెంటనే వారిని స్ధానికులు ఆస్పత్రికి తరలించారు. కాని అప్పటికే ఒకరు మరణించారు.
ఈ కాల్పుల్లో సొహైల్ అనే కానిస్టేబుల్ అక్కడికక్కడే మృతి చెందగా… మహ్మద్ యూసుఫ్ అనే మరో కానిస్టేబుల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలాడు, అక్కడ ఇది అందరిని ఎంతో బాధించింది, ఈ ప్రాంతం అంతా ఎంతో కట్టుదిట్టమైన భద్రతతో ఉంటుంది… అలాంటి చోట ఇలా జరగడంతో అందరూ ఉలిక్కిపడ్డారు… ఇక్కడ మూడు రోజుల్లో ఇలా రెండో ఘటన జరిగింది, ఇక ఆ ఉగ్రవాది గురించి పోలీసులు వెతుకుతున్నారు.
https://twitter.com/i/status/1362677771709784068