ఏపీలో సీఎం జగన్మోహన్ రెడ్డి తన పాలనతో దూసుకుపోతున్నారు.. ఇచ్చిన అన్నీ హామీలు నెరవేరుస్తూ నవరత్న పథకాలను అమలు చేస్తున్నారు.. అయితే ఈ సమయంలో ఏపీలో తిరుపతి ఉప ఎన్నిక గురించి టాక్ నడుస్తోంది, ముఖ్యంగా అధికార వైసీపీ నేతల్లో కూడా ఇక్కడ నుంచి ఎవరు పోటీ చేస్తారు అనే చర్చ జరుగుతోంది.
చిత్తూరు జిల్లా నేతలను కూడా అడిగి అక్కడ ఎవరిని దింపాలి అని చర్చిస్తున్నారు.. ముఖ్యంగా దివంగత ఎంపీ బల్లి దుర్గాప్రసాదరావు కుమారుడు కల్యాణ్ చక్రవర్తిని రంగంలోకి దింపాలి అని కొందరు చెబితే, మరొకరికి సీటు ఇవ్వాలి అని కొందరు అంటున్నారు, అయితే పేర్లు చాలా వరకూ తెరపైకి వస్తున్నాయి.
తాజాగా జగన్ పాదయాత్ర సమయంలో తన వెంట నడిచిన ఫిజియోథెరపిస్ట్ గురుమూర్తికి అవకాశమివ్వాలనే ప్రస్తావన వచ్చినట్లు చిత్తూరులో టాక్ నడుస్తోంది, అయితే కల్యాణ్ కు ఎమ్మెల్సీ ఇచ్చి గురుమూర్తికి ఎంపీ టికెట్ ఇవ్వాలి అని కొందరు చెబుతున్నారు, అయితే సీఎం జగన్ మాత్రం ముందుగా దుర్గాప్రసాద్ కుటుంబ సభ్యులను పిలిచి వారి అభిప్రాయం తీసుకోవాలని భావిస్తున్నారట. చూడాలి ఇక్కడ ఎవరిని ఫైనల్ చేస్తారో.