తాడిపత్రిలో రోజుకు ఒక మర్డర్….

తాడిపత్రిలో రోజుకు ఒక మర్డర్....

0
95

అనంతపురం జిల్లా తాడిపత్రిలో రోజుకు ఒక హత్య జరుగుతోంది… తాజాగా పట్టణంలోని కొంతమంది ఆకతాయిలు మరో వ్యక్తిని హత్య చేశారు.. తాడిపత్రి పట్టణం టైలర్ కాలనీ గాలి మిషన్ దగ్గర కొందరు ఆకతాయిలు ఆటో డ్రైవర్ ను బండరాయితో మోదారు… దీంతో అతని పరిస్ధితి విషమంగా ఉండటంతో కర్నూల్ ఆసుపత్రికి తరలిస్తుండగా రోడ్డు మార్గమాద్యమంలో మరణించినట్లు పోలీసులు తెలిపారు….

పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి… తాడిపత్రిలో ఆటో నడుపుతూ ఒక వ్యక్తి జీవనం సాగించేవాడు.. రాత్రి సమయంలో ఆటోను టైలర్ కాలనీ గాలి మిషన్ వద్ద ఆపి ఉంచగా కొందరు ఆకతాయిలు మద్యం మత్తులో అతనితో గొడవకు దిగారు ఆటో బాడుగ విషయంలో గొడవ పడుతుండగా ఆటో డ్రైవర్ తమ్ముడు ఈ గొడవను ఆపడానికి ట్రై చేశాడు…

అతనిని కూడా ఆకతాయిలు కొట్టారు… ఈ క్రమంలో గొడవ మరింత పెరగడంతో రెచ్చిపోయిన ఆకతాయిలు బండరాయి తీసుకుని తలమీద బాది పరారి అయ్యారు…. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఆటోడ్రైవర్ ను మెరుగైన వైద్యం కోసం కర్నూల్ కు తరలించారు.. రోడ్డు మార్గంలో మృతిచెందినట్లు డాక్టర్లు గుర్తించారు.. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు…