తగ్గిన బంగారం వెండి ధరలు రేట్లు ఇవే

తగ్గిన బంగారం వెండి ధరలు రేట్లు ఇవే

0
108

బంగారం ధర ఈ నెల రోజుల్లో చూస్తే చాలా వరకూ తగ్గింది.. సుమారు పుత్తడి ధర ఈనెలలో 15 రోజులు పెరిగితే 13రోజులు తగ్గింది… అయితే ఈరోజు మాత్రం బంగారం ధరలు తగ్గాయి మరి పుత్తడి ధరలు మార్కెట్ లో ఎలా ఉన్నాయి అనేది చూద్దాం.. ఈ రోజు బంగారం ధర తగ్గింది.

 

హైదరాబాద్ మార్కెట్లో గురువారం బంగారం ధర తగ్గింది… 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.300 తగ్గుదలతో రూ.48,160కు చేరింది.. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.300 తగ్గడంతో రూ.44,150కుట్రేడ్ అవుతోంది.

 

బంగారం ధర పడిపోతే.. వెండి రేటు కూడా తగ్గింది, దీంతో వెండి ధర కేజీకి రూ.500 తగ్గుదలతో రూ.73,500కు చేరింది…పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ తగ్గడంతో వెండి ధర తగ్గింది అంటున్నారు, మరి బంగారం వెండి ధరలు వచ్చే రోజుల్లో ఇంకా పెరిగే అవకాశం ఉంది అంటున్నారు బులియన్ వ్యాపారులు.