తాజాగా పవన్ కు కొత్త టెన్షన్ తెప్పించిన విజయసాయిరెడ్డి

తాజాగా పవన్ కు కొత్త టెన్షన్ తెప్పించిన విజయసాయిరెడ్డి

0
91

ఇంగ్లీష్ విద్యాభోదనకు వ్యతిరేకంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మన నుడి, మన నది ఉద్యామానికి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే… అయితే ఆ ఉద్యమంపై వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి సెటైర్స్ వేశారు…

మన నది మన నుడి సినిమా టైటిల్లాగా అదిరిపోయింది. ముందు మీ నలుగురు పిల్లలను తెలుగు మీడియంలో చేర్పించి నుడికారాన్ని మొదలు పెట్టాలని విజయసాయి రెడ్డి హెచ్చరించారు. తర్వాత మీకు ప్యాకేజి ఇచ్చే యజమాని కృష్ణా నదిని పూడ్చి నిర్మించిన కరకట్ట నివాసాన్ని తొలగించాలని ఆందోళన చేయాలని పవన్ కు హితవు పలికారు. అప్పుడు నదుల రక్షణ సఫలమవుతుందని అన్నారు.

ఇంగ్లిష్ మీడియం బోధనకు వ్యతిరేకం కాదని కుల పెద్ద చంద్రబాబు నాయుడు నాలుక మడతేశాక కిరసనాయిలు ఏం పలుకుతాడోనిని ఎద్దేవా చేశారు. యూదు బాషలో రాసిన బైబిల్ కు ఇంగ్లిష్ కు ఏ సంబంధం లేదని సోషల్ మీడియాలో యువత జ్ణానోపదేశం చేశాక అర్థం చేసుకుని ఉంటాడా? ఇంకా చెత్తపలుకులు పేరుస్తూనే ఉంటాడాని ప్రశ్నించారు