తాజాగా తెలుగు రాష్ట్రాల్లో తిరిగే రైళ్ల వివరాలు ఇవే…

తాజాగా తెలుగు రాష్ట్రాల్లో తిరిగే రైళ్ల వివరాలు ఇవే...

0
76

కరోనా వైరస్ మన దేశంలో చాపకింద నీరులా విస్తరిస్తుండటంతో కేంద్రం లాక్ డౌన్ ప్రకటించింది… దీంతో వాహనాలతో పాటు, రైల్లు కూడా నిలిచిపోయారు… ప్రయాణికులు ఎక్కడికక్కడే నిలిచిపోయారు…

అయితే సుమారు 50 రోజుల తర్వాత కొన్ని రైళ్లను నడపాలని రైల్వే శాఖ నిర్ణయించింది… మొత్తం 15 జతల రైళ్లు న్యూ ఢిల్లీ ముంబాయి, బెంగుళూరు చెన్నై సికింద్రాబాద్ విజయవాడ నగరాల మద్య తిరుగనున్నాయి.. ప్రయాణికులకు ఆరోగ్య పరీక్షలు చేసిన తర్వాత రైళ్లలోకి అనుమతిస్తామని తెలిపింది… అలాగే మాస్కులు తప్పని సరిగా ధరించాలని తెలిపింది…

హౌరా – న్యూఢిల్లీ, రాజేంద్రనగర్ – న్యూఢిల్లీ, డిబ్రూగఢ్ – న్యూఢిల్లీ, న్యూఢిల్లీ – జమ్మూతావి, బెంగళూరు – న్యూఢిల్లీ, తిరువనంతపురం – న్యూఢిల్లీ, చెన్నై సెంట్రల్ – న్యూఢిల్లీ, బిలాస్ పూర్ – న్యూఢిల్లీ, రాంచీ – న్యూఢిల్లీ, ముంబై సెంట్రల్ న్యూఢిల్లీ, అహ్మదాబాద్ – న్యూఢిల్లీ, అగర్తలా – న్యూఢిల్లీ, భువనేశ్వర్ – న్యూఢిల్లీ, మడ్ గావ్ – న్యూఢిల్లీ, సికింద్రాబాద్ – న్యూఢిల్లీల మధ్య రైళ్లు తిరుగుతాయి.

ఇక తెలుగు రాష్ట్రాల మీదుగా వెళ్లే రైళ్ల వివరాలు ఇవే…

* బెంగళూరు, న్యూఢిల్లీ మధ్య రోజూ తిరిగే రైలు, శ్రీ సత్య సాయి ప్రశాంతి నిలయం, ధర్మవరం, అనంతపురం, గుంతకల్, రాయచూరు సికింద్రాబాద్, కాజీపేటల మీదుగా ప్రయాణిస్తుంది. బెంగళూరులో రాత్రి 8 గంటలకు, న్యూఢిల్లీలో రాత్రి 8.45 గంటలకు ఈ రైలు బయలుదేరుతుంది.
* న్యూఢిల్లీ, చెన్నై సెంట్రల్ మధ్య శుక్ర, ఆదివారాల్లో, తిరుగు ప్రయాణంలో బుధ, శుక్ర వారాల్లో నడిచే రైలు, విజయవాడ, వరంగల్ నగరాల మీదుగా ప్రయాణిస్తుంది. న్యూఢిల్లీలో మధ్యాహ్నం 3.55 గంటలకు, చెన్నై సెంట్రల్ లో ఉదయం 6.05 గంటలకు రైళ్లు బయలుదేరుతాయి.
* సికింద్రాబాద్, న్యూఢిల్లీ మధ్య బుధవారం, తిరుగు ప్రయాణంలో ఆదివారం బయలుదేరే రైలు కాజీపేట మీదుగా సాగుతుంది. సికింద్రాబాద్ లో మధ్యాహ్నం 12.45 గంటలకు, న్యూఢిల్లీలో మధ్యాహ్నం 3.55 గంటలకు రైళ్లు బయలుదేరుతాయి.