ఈ కరోనాతో చాలా మంది ఇంటి పట్టున ఉంటున్నారు, ముఖ్యంగా ప్రముఖ కంపెనీలు అన్నీ తమ ఉద్యోగులకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేశాయి, అంతేకాదు వారికి జీతాలతో పాటు డెస్క్ నెట్ బిల్ కూడా అదనంగా ఇస్తున్నాయి.
తాజాగా ఫేస్ బుక్ ఉద్యోగులు కూడా కార్యాలయానికి రాకుండా ఇంటి దగ్గరే వర్క్ చేస్తున్నారు.
ఈ కరోనా తగ్గలేదు కాబట్టి, తన ఉద్యోగులను 2021 జూలై వరకు వర్క్ ఫ్రం హోమ్ విధానంలోనే పనిచేయాలని ఆదేశించింది.
ఇంట్లోనే ఆఫీసు సెటప్ ఏర్పాటు చేసుకునేందుకు ఒక్కొక్కరికి 1000 డాలర్లు ఇస్తోంది. ఇప్పటికే గూగుల్
కూడా తన ఉద్యోగులకి ఇలాంటి ఆఫర్ ఇచ్చింది, దీంతో ఉద్యోగులు చాలా ఆనందంలో ఉన్నారు, అయితే కొన్ని దేశాల్లో పరిమితమైన ఉద్యోగులతో ఆఫీసులు తెరుచుకుంటున్నాయి, అక్కడ పరిస్దితి బట్టి నిర్ణయం తీసుకోనుంది కంపెనీ.