బీజేపీకి థాంక్స్..డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి-కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

0
102

ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..ప్రజాస్వామ్యంపై మోడీకి విశ్వాసం లేదా? 8 ఏళ్ల బీజేపీ పాలన ఫలితాలు చూపిస్తారా? రూపాయి విలువ రూ.80కి ఎప్పుడైనా పడిపోయిందా అని ప్రశ్నించారు. దేశంలో 70 వేల టిఎంసిల నీళ్లు ఉన్న ఇవ్వలేకపోతున్నారు. నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయింది. ఏడాదికి కోటిన్నర ఉద్యోగాలు పోయాయి.

నేను చెప్పిన ప్రతీది వంద శాతం నిజం. బీజేపీ ప్రభుత్వానిది అసమర్ధ పాలన. తెలంగాణకు వచ్చి తెలంగాణ ప్రభుత్వాన్ని తిట్టిపోతారు. నేషనల్ పర్ కేపిటా 1.49 లక్షలు తెలంగాణ పర్ కేపిటా రూ.2.7 లక్షలు. తెలంగాణ జీడీపీ 128 శాతం పెరిగింది. వీరి పరిపాలనలో అవినీతి, కుంభకోణం మాత్రమే ఉంది. ఈ సందర్బంగా బీజేపీకి ఓ విషయంలో థాంక్స్ చెబుతున్న. నిజంగా డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి. కానీ రాష్ట్రంలో ఉన్న డబుల్ ఇంజన్ సర్కార్ కేంద్రంలో అధికారంలోకి రావాలి. ఎందుకంటే కేంద్రం కంటే తెలంగాణ ఎక్కువగా పని చేస్తుంది. నాన్ బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి.