తాను ఆ భూములు కొన్నది నిజమే అంటున్న… వైసీపీ మంత్రి

తాను ఆ భూములు కొన్నది నిజమే అంటున్న... వైసీపీ మంత్రి

0
92

తాను భూ కబ్జాలకు పాల్పడినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మంత్రి గుమ్మరూరు జయరాం… తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కొద్దికాలంగా తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు…

తాను భూములు కొన్నది నిజమే అని అన్నారు… మంజునాథ అనే వ్యక్తి తనకు భూమి అమ్మాడని తెలిపారు.. ఆలూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కూడా తాను విచారించానని క్లియర్ టైటిల్ భూములు అని చెప్పిన తర్వాతే వాటిని తాను కొన్నానని తెలిపారు…

తన రాజకీయ జీవితంలో ఎలాంటి కుట్రలు కుతంత్రాలకు పాల్పడలేదని అన్నారు… అలాగే తాను ఎలాంటి దౌర్జన్యాలకు పాల్పడలేదని అన్నారు… ఒక వేళ తాను భూ కబ్జాలకు, దౌర్జన్యాలకు పాల్పడినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు…