రేపు ఉదయం జీహెచ్ ఎంసీ కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ తర్వాత మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక జరుగనుంది. మొత్తం 150 వార్డులు ఉన్నాయి, ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ 56 వార్డులు గెలిచింది.
48 వార్డులు గెలిచి బీజేపీ రెండో స్థానంలో నిలిచింది.ఎంఐఎం 44 వార్డులు గెలిచింది కాంగ్రెస్ 2 వార్డులు గెలిచింది.
మొత్తం కార్పొరేటర్ల సంఖ్య 150… ఇక ఒకరు మరణించారు దీంతో 149 మంది సభ్యులు ఉన్నారు
ఇక 44 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు ఉన్నారు
ఇలా 149+44 కలిపితే 193 ఓట్లు ఉంటాయి
మేయర్ పీఠం దక్కించుకోవాలంటే 97 మేజిక్ ఫిగర్ రావాలి
మొత్తం 44 మంది ఎక్స్ అఫీషియో సభ్యుల్లో టీఆర్ఎస్కు 31, బీజేపీకి 2. ఎంఐఎం 10 కాంగ్రెస్ కు 1 ఉన్నాయి
ఇలా ప్రక్రియ జరుగుతుంది, ఐతే మేయర్ పదవి దక్కాలంటే మ్యాజిక్ నెంబర్ అవసరం లేదని.. మెజారిటీ సభ్యుల మద్దతు ఉంటే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. రేపు ఉదయం మాత్రమే మేయర్ ఎవరు డిప్యూటీ మేయర్ ఎవరు అనేది తేలుతుంది.