Flash: రేవంత్ దెబ్బకు ఆ మెట్రో స్టేషన్ మూత

0
91

తెలంగాణ సీఎం కేసీఆర్ సర్కార్ విధానాలపై అంశాల వారీగా పోరుబాట కార్యాచరణ ప్రకటించిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తాజాగా విద్యార్థి, నిరుద్యోగ జంగ్‌ సైరన్‌కి శ్రీకారం చుట్టారు. రేవంత్ ఇచ్చిన జంగ్ సైరన్‌కి విశేష మద్దతు లభించింది. భారీ స్థాయిలో విద్యార్థి, నిరుద్యోగులు తరలి వచ్చారు. అయితే జంగ్ సైరన్ ర్యాలీకి అనుమతి లేదని.. ట్రాఫిక్ భారీగా జామ్ అయ్యే అవకాశాలున్నాయని పోలీసులు చెబుతున్నారు. రేవంత్ ర్యాలీకి అనుమతులు లేవని తేల్చి చెప్పారు.

ముందుస్తు చర్యల్లో భాగంగా రేవంత్ రెడ్డి ఇంటి చుట్టూ భారీగా పోలీసులను మోహరించారు. ఆయన ర్యాలీకి వెళ్లకుండా అడ్డుకునేందుకు వందల సంఖ్యలో పోలీసులు పహారా కాస్తున్నారు. అయితే ఆయన నివాసంలో లేరని తెలుస్తోంది.

ఎలాగైనా జంగ్ సైరన్ ర్యాలీ చేపట్టి తీరుతానని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దిల్‌సుఖ్‌నగర్ మెట్రో స్టేషన్‌ను కూడా పోలీసులు మూసి వేయించినట్లు తెలుస్తోంది.