వంట గ్యాస్ ధరలు మళ్లీ ఆకాశాన్ని అంటాయి.. గత నెలలో భారీగా పెరిగిన వంట గ్యాస్ ధరలు నేడు కూడా భారీగా పెరిగాయి.. సామాన్యుడికి వంట గ్యాస్ షాక్ ఇచ్చింది.. అంతేకాదు ఈసారి ఇంటి గ్యాస్ తో పాటు వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలు కూడా పెరిగాయి.
ఈ నెల ఒకటో తేదిన వంటగ్యాస్‌పై రూ.25, వాణిజ్య సిలిండర్‌పై రూ.95ను పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి.. ఇక ఫ్రిబ్రవరిలో 25వ తేదిన సిలిండర్ పై 25 రూపాయలు పెంచింది, నేడు వారం తిరక్కుండానే మరో 25 రూపాయలు పెరిగింది.
నాలుగుసార్లు గ్యాస్ సిలిండర్ ధరలను పెంచడంలో ఈ నెలలో మొత్తం రూ.125 పెరిగినట్లయింది. అంతేకాదు మూడు నెలల వ్యవధిలో గ్యాస్ బండపై రూ.225 పెరిగింది. సామాన్యుడికి మాత్రం ఈ రేట్లు చుక్కలు చూపిస్తున్నాయి.819కి చేరింది గ్యాస్ ఇక కమర్షియల్ బండ 1,614కు చేరింది.
|
|
మళ్లీ పెరిగిన వంట గ్యాస్ ధర ఎంత పెరిగిందంటే
-