మహిళను రక్షించిన యాపిల్ స్మార్ట్ వాచ్ ఎలా అంటే

-

టెక్నాలజీ మనకు చాలా సాయం చేస్తోంది, ముఖ్యంగా ఈ టెక్నాలజీ వల్ల అభివృద్దితో పాటు నేరాలు జరగకుండా ఆపుతున్నారు, ముఖ్యంగా కిడ్నాపులు ప్రమాదాలు ఇలాంటివి జరగకుండా చాలా వరకూ ఈ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు, ముఖ్యంగా సీసీ కెమెరాల వల్ల ఇలాంటి కేటుగాళ్లు చాలా మంది దొరుకుతున్నారు.

- Advertisement -

టెక్నాలజీలో స్మార్ట్వాచ్లు ప్రత్యేక పాత్రను పోషిస్తున్నాయి. ఇక యాపిల్ వాచ్ అయితే ఎన్నో ప్రత్యేకతలు ఉన్న వాచ్, అందుకే దీనీని చాలా మంది వాడుతూ ఉంటారు, తాజాగా అమెరికాలోని టెక్సాస్లో కిడ్నాపర్ల చెర నుంచి మహిళను రక్షించడంలో యాపిల్ స్మార్ట్వాచ్ కీలక పాత్ర పోషించింది.

టెక్సాస్లోని సెల్మాప్రాంతానికి చెందిన ఓ మహిళని ఈ వాచ్ కాపాడింది, ఆమె బయటకు వెళ్లిన సమయంలో కిడ్నాప్ కు గురైంది.. వెంటనే తన కుమార్తెకు ఓ విషయం చెప్పింది అది ఏమిటి అంటే, తాను ఆపదలో ఉన్నాను హెల్ప్ చేయండి అని తన యాపిల్ వాచ్ నుంచి SOS కాల్ చేసింది. అయితే ఆమె ఉన్న ప్రదేశం గురుంచి తెలుసుకునే లోపే వాచ్ నుంచి కనెక్షన్ కట్ అయ్యింది.

ఎమర్జెన్సీ సెల్యూలార్ పింగ్ టెక్నాలజీ సాయంతో కిడ్నాప్కు గురైన మహిళను ట్రాక్ చేశారు. అక్కడ ఓ హోటల్ పార్కింగ్ ప్లేస్ దగ్గర మహిళను గుర్తించి కిడ్నాపర్లను అరెస్ట్ చేశారు పోలీసులు. ఇలా తనను ఈ యాపిల్ వాచ్ రక్షించింది అని ఆమె తాజాగా తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Seethakka | భారత్‌కు బీజేపీ ఏం చేసింది.. బండికి సీతక్క సూటి ప్రశ్న

కేంద్రమంత్రి బండి సంజయ్‌పై మంత్రి సీతక్క(Seethakka) ఫైరయ్యారు. ‘బీజేపీది భారత్ టీం...

Bandi Sanjay | కాంగ్రెస్‌ది పాకిస్థాన్ టీం: బండి సంజయ్

Bandi Sanjay Controversial Comments | ఎమ్మెల్సీ ఎన్నికల నడుమ తెలంగాణ...