పంజాబ్ ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ దూసుకుపోతుంది. పంజాబ్ లో మొత్తం స్థానాలు 117 కాగా..తాజా ఫలితాల ప్రకారం ఆప్ 89 స్థానాలు అధిక్యంలో ఉంది. దీనితో ప్రభుత్వ ఏర్పాటు దిశగా ఫలితాలు వెలువడుతున్నాయి. దీంతో ఆ రాష్ట్రంలో ఆప్ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. మరోవైపు సీఎం చన్నీ, సుఖ్‌బీర్ బాదల్, అమరీందర్‌సింగ్‌తో పాటు.. చన్నీ మంత్రివర్గంలో ఎక్కువ మంది మంత్రులు వెనుకంజలో ఉన్నారు. పంజాబ్‌లో వెనుకంజలో మాజీ సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్ ఉన్నారు. దీనితో ఆమ్ ఆద్మీ రెండో రాష్ట్రాన్ని కైవసం చేసుకుంది. మరోవైపు రైతులను కారుతో తొక్కించిన లఖింపూర్ ఖేరీలో బీజేపీ క్లీన్ స్వీప్ చేయగా..రాజకీయాల్లో డబ్బులు, మీడియాలు అవసరం లేదు కమిట్మెంట్ ఉంటె చాలు అని కేజ్రీవాల్ ఈ ఫలితాల ద్వారా నిరూపిస్తున్నారు.