ఏపీ ప్రభుత్వం శుభవార్త..వారికీ ఉచితంగా బోర్లు మంజూరు

0
83

జగన్ సర్కార్ వరుస శుభవార్తలతో ప్రజలకు ఆనందపరుస్తున్నారు. జగన్ సీఎం అయిన్నప్పటి నుండి తన మార్క్ చుపెట్టుకుంటున్నాడు. అంతేకాకుండా వినూత్నమైన మార్పులు చేస్తూ ఏపీని అభివృద్ధి చేస్తున్నాడు. ప్రస్తుతం జగన్ సర్కార్ ఏపీ రైతులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది.

పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ పై సీఎం జగన్ సమీక్ష నిర్వహించి రైతులకు ఉచితంగా బోర్లు వేయాలని నిశ్చయించారు. ఏపీలో ఉన్న 175 నియోజవర్గాల్లో రిగ్గు ఉండాలని తెలిపారు. ఒక్కో బోరుకు కనీసం రూ.4.50 లక్షలైనా ఖర్చు చేస్తున్నామని ఈ మేరకు ప్రకటించారు.

ఐదు ఎకరాలలోపు అర్హత ఉన్న రైతులకు అన్ని రకాల సౌకర్యాలతో పాటు ఉచిత బోరు కూడా మంజూరు చేస్తామని వెల్లడించారు. 5–10 ఎకరాల మధ్యలో ఉన్న రైతులకు డ్రిల్లింగ్‌ ఉచితమని తెలిపారు. రానున్న ఐదేళ్లలో ప్రతి చెరువును కెనాల్స్, ఫీడర్‌ ఛానెల్స్‌కి లింక్‌ చేస్తే రైతులకు నీటి కొరత తగ్గుతుందని తెలిపారు.