ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..వారికి రూ.5 లక్షల సాయం

0
110
AP Govt

ఏపీ రాష్ట్రంలో ఇప్పటి వరకు వరదలతో 34 మంది మరణించారని అసెంబ్లీలో ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. మరో 10 మంది గల్లంతయ్యారని తెలిపింది. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ఇస్తున్నామని, ఇప్పటికే 95 శాతం మంది మృతుల కుటుంబాలకు అందించినట్లు పేర్కొంది. ఇక 8 లక్షల ఎకరాల్లో పంటనష్టం జరిగిందని..5,33,345 మంది రైతులు నష్టపోయినట్లు ప్రభుత్వం వెల్లడించింది.