పిల్లలు దేవుడితో సమానం వారు ఏదైనా తింటున్న సమయంలో వారు ఆడుకుంటున్న సమయంలో కచ్చితంగా తల్లిదండ్రులు వారిని గమనించాలి… లేకపోతే వారికి తెలియక ఏది పడితే అది తింటే అనారోగ్యానికి గురి అవుతారు.. ఒక్కోసారి ప్రాణాపాయం కూడా ఉంటుంది.. ఎల్ఈడీ బల్బుతో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు దానిని మింగేశాడు 9 ఏళ్ల బాలుడు.
అది బయటకు రాక ఊపిరి తీసుకోలేక చాలా ఇబ్బంది పడ్డాడు… దీంతో ఏడుపు ఆపలేదు వెంటనే తల్లిదండ్రులు చూసేసరికి బాబు బాధ అర్దం అయింది వెంటనే ఆస్పత్రికి తీసుకువెళ్లారు.. నోటి మాట రావడం లేదు వెంటనే స్కానింగ్ చేసి చూశారు వైద్యులు..స్కానింగ్ తీయగా ఎల్ఈడీ బల్బు కనిపించింది. శ్వాసనాళంలో ఊపిరితిత్తుల సమీపంలో దానిని గుర్తించారు. పీడీయాట్రిక్ రిజడ్ బ్రాంక్ స్కోపి చేసి ఆ బల్బును బయటకు తీశారు..
అయితే బయట ఆడుకుంటున్న సమయంలో తెలియక ఇది తిన్నాడు, దగ్గు శ్వాస ఇబ్బంది వచ్చింది సమయానికి తీసుకురావడంతో బాబు గండం నుంచి బయటపడ్డాడు… అందుకే చిన్న పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఏది పడితే అది మాత్రం ఇవ్వకండి.