గతంలో పెద్దలు వివాహ సంబంధాలు చూసేవారు… అప్పట్లో అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూసేవారు ఇప్పుడు అసలు ఆ కుటుంబం గురించి కూడా చూసే అవకాశం ఉండటం లేదు, అంతా ఆన్ లైన్ సైట్లలో సోషల్ మీడియాలోనే పెళ్లి చూపులు అయిపోతున్నాయి, ఇద్దరికి ఐదు అంకెల జీతం ఉంటే చాలు మూడు ముళ్లు వేసేస్తున్నారు.
ఇక కులాలు మతాలు పట్టింపులు చాలా వరకూతగ్గిపోయాయి అనే చెప్పాలి, అయితే తాజాగా సెల్ ఫోన్ కు బాగా అలవాటు పడిన అమ్మాయిలు చాలా మంది ఉంటున్నారు, వీరి వల్ల ఏకంగా కుటుంబాల మధ్య దూరం పెరుగుతోంది విడాకులు కూడా తీసుకుంటున్నారు కొందరు.
ఈ ఇబ్బందులు ఏమీ ఉండకూడదు అని ఓ వరుడు సరికొత్త ప్రకటన ఇచ్చాడు…అడ్రెస్, చదువు, ప్రాపర్టీస్, అందం, పొడవు తో పాటు కాబోయే భాగస్వామి సోషల్ మీడియాకు బానిస కానటువంటి వధువు కావాలి అనే ప్రకటన ఇచ్చాడు… ఇంతకీ ఎక్కడ అనుకుంటున్నారా ?
పశ్చిమ బెంగాల్, కమర్పుకుర్కు చెందిన ఓ వ్యక్తి చేసిన ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. నిజమే ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి చాలా కండిషన్లు వచ్చాయి అంటున్నారు నెటిజన్లు.