| వివాహం సెట్ అవ్వడమే కాదు పెళ్లిపీటల మీద తాళికట్టే వరకూ టెన్షన్ ఉంటోంది ఇరు కుటుంబాలకి… ఈ మధ్య జరుగుతున్న కొన్ని ఘటనల వల్ల ఇరు కుటుంబాలు  కూడా వివాహ తంతు ముగిసే వరకూ ఎంతో టెన్షన్ తోనే ఉంటున్నారు.. కోటి ఆశలతో అతడు పెళ్లి చేసుకున్నాడు. మంచి అమ్మాయి జీవిత భాగస్వామిగా దొరికినందుకు ఎంతో సంతోషపడ్డాడు. కాని ఆ ఆశలు ఎంతో సేపు లేవు… ఏకంగా వివాహం అయిన ఆరు రోజులకి సీన్ మొత్తం అక్కడ మారిపోయింది. గుజరాత్లోని జునాగఢ్ జిల్లా జోషిపురాకు చెందిన   సతీష్   భగవతీ అనే యువతిని వివాహం చేసుకున్నాడు.. ఇక మంచి అమ్మాయి దొరికింది అని చాలా ఆనందపడ్డాడు.. కాని వివాహం అయి ఆరు రోజులు అయింది.. ఓరోజు భగవతి ఇంటి నుంచి వెళ్లిపోయింది. వారి తల్లిదండ్రులకు కబురు పంపినా రాలేదని చెప్పారు… ఇక ప్రియుడితో వెళ్లిపోయింది అని అందరూ అనుకున్నారు. కాని అసలు విషయం అది కాదు అని తేలింది…ఆ యువతి పచ్చి మోసగత్తె. బంగారం నగలతో పాటు డబ్బుతో పారిపోయింది.. ఖరీదైన ఫోన్, ఆభరణాలను ఎత్తుకెళ్లింది ఆమెకి  ప్రియుడు లేడు.. ఆమె కేవలం నగదు బంగారం పై కన్నేసింది.. డబ్బుల కోసమే ఇలా పెళ్లి చేసుకున్నట్లు నాటకమాడిందని తెలిసింది.  ఇక ఆమె గురించి ఈ విషయం తెలిసి పెళ్లికొడుకు షాక్ అయ్యాడు, ఇక ఆ అమ్మాయి పై కేసు నమోదు చేశారు. 
 
 |  |  | 
పెళ్లైన ఆరు రోజులకి పెళ్లి కూతురు పారిపోయింది – అసలు విషయం తెలిసి పెళ్లికొడుకు షాక్
-
 
                                    


