తాళికట్టిన రెండుగంటల తర్వాత పెళ్లికొడుకుని చెప్పుతో కొట్టిన పెళ్లికూతురు

Movie scene in Marriage

0
136

ఉత్తరప్రదేశ్ లోని రామ్ నగర్ లో ఆ ఇంట వివాహం జరుగుతోంది. దాదాపు 30 మంది బంధువులు అతి తక్కువ మంది సమక్షంలో వివాహం జరుగుతోంది… అబ్బాయి ఇంజనీర్ కావడంతో భారీగా కట్న కానుకలు సమర్పించి అమ్మాయి కుటుంబం ఆనందంలో ఉంది.ఇక సినిమాల్లో సడెన్ ఎంట్రీలా వివాహం అయిన రెండు గంటల తర్వాత దేవీ రాణి అనే యువతి అక్కడకు వచ్చింది.

ఆ పెళ్లికొడుకు పచ్చిమోసగాడు తనని మూడేళ్ల క్రితం ప్రేమించాడు సీక్రెట్ గా వివాహం చేసుకున్నాడు, ఇక నాతో కాపురం ఉండి ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకున్నాడని అతని ఫోటోలు చూపించింది.అయితే దీంతో పెళ్లి కూతురు కుటుంబం షాక్ అయింది.

ఇక్కడ పెళ్లి కూతురు వెంటనే చెప్పు తీసుకుని పెళ్లి కొడుకుని కొట్టింది …అతని ఫోన్ నుంచి పంపిన మెసేజ్ లు ఫోటోలు అన్నీ చూపించి ఆ అమ్మాయితో ఈ పెళ్లి కూతురు పోలీస్ స్టేషన్ కు వెళ్లి, నవ వరుడికి షాక్ ఇచ్చి కేసు పెట్టింది… ఇక ఇతను మరో యువతిని కూడా ప్రేమిస్తున్నాడు అని విచారణలో తేలింది.