ముందు పెళ్లి చేసుకున్నాడు అనారోగ్యంతో భార్య చనిపోయింది… ఇక ఇటీవల పెద్దలు అతనికి మరో సంబంధం చూసి పెళ్లి చేశారు.. అయితే వివాహం జరిగిన రెండో రోజు కాపురానికి వచ్చిన భార్య.. భర్త ఇంటిలో ఉన్న నగదు, నగలు తీసుకుని ప్రియుడితో కలిసి పరారైంది. అనంతపురం జిల్లాలో ఈ దారుణమైన ఘటన జరిగింది, ఇక వివాహం అయింది కదా అని సంతోషం కూడా అతనికి దూరం అయింది.
భార్య ఆరు నెలల క్రితం అనారోగ్యంతో మరణించడం తో ఇద్దరు పిల్లలు ఉన్నారు అని వేరే వివాహం చేసుకున్నాడు..
అంతా బాగానే జరిగింది… ఆమె కూడా పెళ్లికి ఒప్పుకుంది… వివాహాం తర్వాత మరుసటి రోజు భర్త ఇంటికి కాపురానికి వచ్చింది 2 వ భార్య… అదునుచూసుకుని ఇంట్లో ఉన్న మూడు తులాల బంగారు నగలు, రూ.80వేల నగదు దోచేసింది.
ఇలా రాత్రికి రాత్రి ఇంటి నుంచి పారిపోయింది, అయితే పోలీసులకు ఫిర్యాదు చేశారు వరుడు కుటుంబం.. ఇక ఆమె తన ప్రియుడితో
ఒడిశాలో ఉన్నట్లు తెలుసుకున్నారు.. దీనిపై పోలీసులకి ఫిర్యాదు చేయడంతో ఆమె గురించి తెలుసుకుంటున్నారు, ఆమె సెల్ ఫోన్ సిగ్నల్ ప్రకారం ఎక్కడ ఉందో తెలుసుకుంటున్నారు.
ReplyForward
|