కొంత మంది కలెక్టర్లు తాము పనిచేసిన చోట ఆ పనితనంతో అక్కడ ముద్రవేసి వెళతారు. వారి గురించి ప్రజలు కచ్చితంగా చెప్పుకుంటారు. పలానా కలెక్టర్ మాకు ఇది చేసి పెట్టారు అని. ఇలా ఎందరి జీవితాల్లోనో వెలుగులు నింపిన అధికారులు ఉన్నారు. తాజాగా ఇలాంటి ఘటన గురించే తమిళనాడులో మాట్లాడుకుంటున్నారు.
కరూర్ జిల్లాలోని ఒక గ్రామంలో ఒక చిన్న గుడిసెలాంటి ఇంటిలో 80 సంవత్సరాల ఒక అవ్వ నివసిస్తుండేది. ఆమెకి ఎవరూ లేరు. ఈ విషయం అక్కడ కలెక్టర్ కి తెలిసింది. ఆ అవ్వ ఇంటికి వెళ్లి ఆమెని లోపలికి రావచ్చా అని అడిగారు. ఆమె రావచ్చు అని చెప్పింది. ఆయన ఎవరో చెప్పి పరిచయం చేసుకున్నారు.
ఆ కలెక్టర్ గారు తన భార్య చేత వంటచేయించుకుని, క్యారియర్ తీసుకుని వెళ్లాడు. ఇక్కడ భోజనం చేస్తాను అన్నాడు. ఆమె కంచాలు లేవు అంది అరటి ఆకులో ఆయనకు అన్నం పెట్టింది. వెళుతూ అవ్వ చేతిలో ఒక కవర్ ఇచ్చాడు కలెక్టర్ . ఇందిరా ఆవాస్ యోజన కింద మంజూరు చేసిన ఇంటి పత్రాలు, అలాగే వృద్దాప్య ఫించనుకు సంబంధించిన పత్రాలు అందులో ఉన్నాయి. నువ్వు ఇంటిలో ఉండవచ్చు. నీకు బ్యాంకు నుంచి వచ్చి వారు నగదు ఇస్తారు అని చెప్పాడు. ఆమె ఎంతో సంతోషించింది. ప్రజా సేవలో ఇలాంటి కలెక్టర్లు ఉండాలి అని అక్కడ చూసిన జనం మాట్లాడుకున్నారు.