ఈ సంక్రాంతి తర్వాత స్కూళ్లు ప్రారంభించాలి అని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు, అయితే తాజాగా కీలక ప్రకటన వచ్చేసింది..తెలంగాణలో ఫిబ్రవరి 1 నుంచి విద్యాసంస్థల పునఃప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. అధికారులకి ఆదేశాలు వచ్చాయి… సంక్రాంతి తర్వాత క్లాసులు ప్రారంభించాలి అని అధికారులు నివేదిక తయారు చేశారు సీఎంకు అందచేశారు..
ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, కరోనా వ్యాక్సినేషన్ కూడా ప్రారంభమవుతున్న సమయంలో ఫిబ్రవరి 1వ తేదీ నుంచి తరగతులు ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఇక పేరెంట్స్ కూడా ఇదే కోరుకుంటున్నారు, దీనిపై తాజాగా క్లారిటీ అయితే వచ్చింది.
మొత్తానికి ఏపీలో కూడా క్లారిటీ రానుంది ఎప్పటి నుంచి స్కూళ్లు ప్రారంభం అవుతాయో….అయితే గత ఏడాది మార్చి 2020 నుంచి పాఠశాలలు కాలేజీలు క్లోజ్ అయ్యాయి.. ఈ కరోనా సమయంలో పిల్లలలకు స్కూల్ కు పంపేందుకు పేరెంట్స్ కూడా వెనకడుగు వేశారు.