అక్రమ సంబంధాల కోసం.. ప్రేమల కోసం.. అఫైర్ల కోసం తల్లిదండ్రులని భర్తలని భార్యలని కూడా కొందరు అంతం చేస్తున్నారు, క్షణిక సుఖాల కోసం ఇలా వెంపర్లాడుతున్నారు… ఇక కన్నతల్లిదండ్రులని కూడా దారుణంగా హతమారుస్తున్నారు సొంత బిడ్డలు…ఒక బాలిక ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసింది. ఈ దారుణమైన ఘటన మహారాష్ట్రలోని థాణే జిల్లాలో జరిగింది.
భర్త నుంచి దూరంగా ఉంటున్న 40 ఏండ్ల మహిళ తన 15 ఏండ్ల కుమార్తెతో కలిసి ఉల్హాస్ నగర్ క్యాంప్ ప్రాంతంలో నివాసం ఉంటుంది. ఇక ఆమె కుమార్తె జీన్స్ కర్మాగారంలో పని చేస్తోంది… అక్కడ ఓ యువకుడితో పరిచయం ప్రేమగా మారింది, ఇక తల్లి ఆ ప్రేమని వ్యతిరేకించి ఆమెని అతనిని దూరం పెట్టింది.
దీంతో తల్లిని అడ్డు వదిలించుకోవాలి అని పన్నాగం వేసింది ఆమె కుమార్తె…మధ్యాహ్నం కుమార్తె ఫ్యాక్టరీ నుంచి ఇంటికి వచ్చింది. ఆమె తలుపు తెరిచి ఉంచగా లోనికి వచ్చిన ప్రియుడు వంట ఇంట్లో ఉన్న బాలిక తల్లిని కత్తితో పొడిచాడు.ఆమెని అలా రక్తం మడుగులో ఉంచి ఇద్దరూ ఫ్యాక్టరీకి వెళ్లిపోయారు, ఇక రాత్రి ఇంటికి వచ్చి మా అమ్మని ఎవరో చంపారు అని స్ధానికులకి చెప్పింది. చివరకు పోలీసులకు అనుమానం వచ్చి ఆమెని ఆరాతీస్తే వాస్తవాలు బయటపడ్డాయి.
|
|
ప్రేమకోసం ప్రియుడి కోసం తల్లిని అడ్డు తొలగించిన కూతురు – దారుణం
-