ఈ టెక్నాలజీ బాగా డవలప్ అయ్యాక ఆన్ లైన్ గేమ్స్ చాలా మంది ఆడుతున్నారు, అయితే ఇది ఒక్కోసారి చాలా వింత సంఘటనలకు కారణం అవుతోంది, అయితే చాలా మంది ఇప్పుడు ఆన్ లైన్ గేమ్ కు అలవాటు పడ్డారు.
ఇలా ఆన్ లైన్ లో స్నేహితులు కుటుంబ సభ్యులు కూడా గేమ్ గ్రూపులుగా ఆడుతున్నారు, ఈ లాక్ డౌన్ సమయంలో చాలా మంది ఈ గేమ్స్ పైనే ఫోకస్ చేశారు, ఇక లూడో గేమ్ ఎంత ప్రాచుర్యంలోకి వచ్చిందో తెలిసిందే.
ఇటీవల తండ్రి కూతురు ఇలాగే కాలయాపన కోసం ఓ గేమ్ ఆడారు.. గేమ్ లో జరిగిన చిన్న పొరపాటు ఏకంగా కోర్టు వరకు వెళ్లడం సంచలనం గా మారిపోయింది.మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో ఈ గేమ్ కేసు ఫైల్ చేసింది కూతురు.
తండ్రీ కూతుళ్లు లో ఆడుతున్న సందర్భంలో… తన తండ్రి తప్పుగా ఆట ఆడి తనను గేమ్ లో చీటింగ్ చేశాడు అంటూ ఆరోపించింది. ఈ లూడో గేమ్ లో తన తండ్రి నన్ను చీట్ చేశాడు అని ఆమె కేసు ఫైల్ చేయడంతో అందరూ షాక్ అయ్యారు, దీనిపై కోర్టు కౌన్సిలర్ మాట్లాడుతూ యువతి కౌన్సిలింగ్ ఇస్తున్నాము అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఇక్కడ తండ్రి గేమ్ గెలవడం జీర్ణించుకోలేక కేసు పెట్టిందట.