గల్ఫ్ దేశాల్లో చాలా కఠిన శిక్షలు ఉంటాయి, ఆ దేశంలో ఉన్న రూల్స్ కచ్చితంగా దేశంలో ఉన్న ప్రజలు పాటించాల్సిందే, అంతేకాదు అక్కడకు వచ్చిన టూరిస్టులు అలాగే అక్కడ పనిచేసుకోవడానికి వచ్చిన వారు అందరూ కూడా వీటిని పాటించాలి. లేదంటే దారుణమైన శిక్షలు ఉంటాయి, ప్రపంచంలో ఇలాంటి శిక్షలు మీరు ఎక్కడా విని ఉండరు.
సౌదీ అరేబియాకు వలస వెళ్లిన తెలుగు కార్మికులు చెప్పుకుంటుంటారు ఈ శిక్షలు చట్టాల గురించి.. ఇక చిన్న చిన్న తప్పులు అని మనం అనుకుంటాం కాని వాటికి అక్కడ మరణ శిక్ష వేస్తారు. ఇక మన ప్రపంచంలో అత్యధిక మరణ శిక్షలు కూడా సౌదీలోనే అమలు అవుతాయి.
ఏఏ తప్పులకు మరణ శిక్షను విధించాలన్న దానిపై సౌదీ అరేబియా ముందుగానే ఓ జాబితాను సిద్ధం చేసుకుంది…మరి ఆ తప్పలు ఏమిటి అనేది చూస్తే.
ఎవరైనా అక్కడ ఇస్లాం మతం నుంచి వేరే మతంలోకి మారినా లేదా మార్చాలి అని ప్రయత్నించినా మరణ శిక్ష వేస్తారు
గూడచర్యం ఏ విషయంలో చేసినా మరణశిక్ష తప్పదు
హత్య కి మరణశిక్ష
అత్యాచారం చేస్తే మరణశిక్ష
స్వలింగ సంపర్కం చేస్తే మరణశిక్ష
ఉగ్రవాద కార్యకలాపాలు జరిపినా మరణ శిక్ష విధిస్తారు
డ్రగ్స్ స్మగ్లింగ్ మదక ద్రవ్యాలు అమ్మడం కొనడం తయారు ఇలా అన్నింటికి మరణ శిక్ష
ఇస్లాం మతాన్ని దూషించినా, దైవ దూషణకు పాల్పడినా వారికి మరణదండన
అతి తీవ్ర దోపిడీలు, దొంగతనాలు కూడా మరణ శిక్ష
ఎవరైనా వివాహం అయిన వారు వ్యభిచారం చేస్తే వారిని రాళ్లతో కొడతారు
వివాహం కాని వారికి అయితే కొరడా దెబ్బలతో శిక్ష
ఇక్కడ మంత్రాలు చేతబడి ఇలాంటివి చేసినా మరణ శిక్ష
ReplyForward
|