కేటీఆర్ కు ఆ వ్యాధి..స్వయంగా వెల్లడించిన మంత్రి

0
79
KTR

మంత్రి కేటీఆర్ తనకున్న వ్యాధి గురించి తెలిపారు. ఈ-హెల్త్‌ ప్రొఫైల్‌ ప్రాజెక్టును వేములవాడలో మంత్రి కేటీఆర్​ ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..’16, 17 ఏళ్లు క్రితం ఇన్సూరెన్స్ తీసుకోవడం కోసం ఏజెంట్​ను పిలిచా. ఆయన పరీక్షలు చేయాలి అంటే… చేయి నాకేం అయింది మంచిగ ఉన్న అని చేయమన్న. తెల్లారి వచ్చి సర్​ మీకు షుగర్ ఉంది అన్నడు. నాకు డౌట్ వచ్చింది… మళ్లీ పరీక్షలు చేయించుకున్నా. షుగర్​ ఉన్నట్లు వచ్చింది. నాకు షుగర్ ఉన్న విషయం నాకే తెల్వదు. నేను చదువుకున్నా.. అంతో ఇంతో తెలుసు. నాకు లోపల షుగర్ ఉన్నదని తెల్వదు. తెలుసుకుంటే ఆరోగ్యం పరంగా జాగ్రత్తలు తీసుకుంటాం అని కేటీఆర్ అన్నారు.