మనం స్టోరీల్లో వింటాం నిజంగా కలలో వచ్చింది జరిగింది అని…. అలాగే సినిమాల్లో కూడా చూస్తాం.. అయితే నిజంగా ఇలా జరిగిందా అంటే మనం నిజంగా నిరూపించలేము.. కాని ఇక్కడ ఓ మహిళ మాత్రం తన జీవితంలో జరిగిన విషయం గురించి చెబుతోంది …ఆమెకి ఏది అయితే కల వచ్చిందో అదే నిజ జీవితంలో జరిగింది… నిజంగా ఈ విషయం తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
ఇంగ్లండ్ కు చెందిన కరోలన్ బ్రూస్ అనే మహిళకు ఇటీవల అనేక కలలు వస్తున్నాయి, ఆమె వయసు 51 ఏళ్లు.. , ఈ మధ్య కొన్ని రోజులుగా తాను చనిపోయినట్టు కలలు వస్తున్నాయట, దీంతో ఆమెకి అసలు నిద్ర పట్టేది కాదు, ఆమె ప్రస్తుతం ఓ ఆస్పత్రిలో నర్సుగా చేస్తోంది.
రొమ్ము క్యాన్సర్ కు గురై, చనిపోయినట్టు కలగంది. దీంతో ఆమెకి అనుమానం వచ్చింది… ఇలా నాలుగు రోజులు కల వచ్చింది.. వెంటనే ఆమె టెస్ట్ చేయించుకుంది..నిజంగానే ఆమె రొమ్ము క్యాన్సర్ తో బాధపడుతున్నట్టు వెల్లడైంది.ఇక ఆమెకి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు, నిజంగా ఆమెకి వచ్చిన కల ఆమెని బతికించింది అంటున్నారు అందరూ… ఇలాంటి కలలు ఆమె ఆస్పత్రిలో చేరిన తర్వాత రాలేదంట.