గుడ్డు తెచ్చుకుని ఆమ్లెట్ వేసుకుని తిందాం అని భావించాడు ఓ వ్యక్తి.. కాని అందులో నుంచి వచ్చింది చూసి షాకయ్యాడు..
ఈ వింత ఘటన కలకలం రేపింది. ఇలాంటి ఘటన ఇప్పటి వరకూ జరగలేదు అంటున్నారు సోషల్ మీడియాలో అందరూ.
సోమనాథ్ ఆమ్లెట్ వేసుకుందాం అని బయట నుంచి గుడ్డు తీసుకువచ్చాడు.
దానిని ఆమ్లెట్ వేయమని భార్యకి ఇచ్చాడు ఆమె పగలగొట్టింది కాని అందులో తెల్ల సొన పచ్చసోన రాలేదు. నల్లని పాము పిల్ల బయటకు వచ్చింది… వెంటనే ఆమె దానిని పక్కన పడేసి అరుపులు అరిచింది. ఇక భర్త వచ్చి చూసేసరికి చిన్న పాము పిల్ల కనిపించింది..అసలు కోడిగుడ్డులో పాము ఎలా వచ్చింది అంటే.
ఇక్కడ కోడి గుడ్లలో పాము గుడ్డు పెట్టి ఉండచ్చు అని అందుకే ఇలా జరిగి ఉంటుంది అంటున్నారు.. మొత్తానికి ఇలాంటి ఘటనలు మన దేశంలో జరగడం చాలా అరుదు.. అయితే దీనిపై అక్కడ షాపు యజమానికి తెలిపారు ఈ విషయం.. ఇక అతను కూడా కోళ్ల ఫారం వ్యక్తికి సమాచారం ఇచ్చాడు. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.