ప్రముఖ గ్రామం – ఏడాదిలో నెల మాత్రమే ప్రజలకు కనిపిస్తుంది – ఎక్కడంటే

-

మన దేశంలో ఎన్నో గ్రామాలు ఉన్నాయి… ఒక్కో గ్రామానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది, అయితే కొన్ని గ్రామాల గురించి వాటి చరిత్ర వింటే ఆశ్చర్యం కలుగుతుంది. ఇప్పుడు మనం చెప్పుకునే గ్రామం  కూడా అలాంటిదే,
గోవాలోని కుర్ది గ్రామం ఏడాదిలో11 నెలలు నీట మునిగి ఉండి ఒక నెలమాత్రమే తేలుతుంది. ఇది ఏమిటి గ్రామం ఇలా మునగడం ఏమిటి అని అనుకుంటున్నారా.. అవును దీనిని చూసేందుకు అక్కడకు పర్యాటకులు వస్తారు ఆ గ్రామస్తులు ఎదురుచూస్తారు.
మనం దీని గురించి చెప్పుకుందాం… గోవాలోని పశ్చిమ కనుమల్లో కొండల మధ్యలో సలౌలిం నది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నది పరీవాహక ప్రాంతంలో కుర్ది అనే గ్రామం ఉంది.  1986లో ఆ నదిపై ఆనకట్ట నిర్మించారు.. ఇక దీని వల్ల ఆ గ్రామం నీట మునిగింది. వేసవిలో మాత్రం నీరు ఉండక ఈ గ్రామం పైకి తేలుతుంది.
ఆ సమయంలో గ్రామం ఆనవాళ్లు శిథిలాలు బయటకు కనబడుతాయి. ఇక ఆకనట్ట కోసం భూములు ఇచ్చిన వారు అందరూ ఇక అక్కడ నుంచి వేరే ప్రాంతానికి వెళ్లిపోయారు… కాని ఇలా గ్రామం కనిపించే సమయంలో ఆ నెల రోజులు అక్కడకు వచ్చి సంబరాలు చేసుకుంటారు తమ పెద్దలను గుర్తు చేసుకుంటారు..
అక్కడ గ్రామంలో దేవాలయం ఉండేది. ఇప్పుడు ఆ దేవాలయంలో ఆ నెల రోజులు ఆ దేవుడ్ని తలచుకుంటారు.. ఇక ఈ గ్రామాన్ని చూసేందుకు అనేక ప్రాంతాల నుంచి చాలా మంది వస్తూ ఉంటారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...