ఒక్కోసారి అదృష్టం మన దగ్గరకు తలుపు తట్టి మరీ వస్తుంది.. ఇది కూడా ఇలాంటిదే అని చెప్పాలి, ఇతను లక్కీ పర్సన్,
థాయిలాండ్లో జాలరి చేపల కోసం సముద్రంలోకి వెళ్లాడు. ఆ రోజు అతనికి అదృష్టం వరించింది, ఎందుకు అంటే అతను చేపల కోసం వల వేశాడు.
ఈ సమయంలో కుడివైపున నీటిలో మూడు ఆల్చిప్పలు తేలుతూ ఉండటాన్ని చూశాడు. వాటిలో ఏమీ ఉండవనీ… అందుకే నీటిలో తేలుతున్నాయి అనుకొంటూ సరదగా సంచిలో వేసుకుని బుట్టలో పట్టిన చేపలు వేసుకున్నాడు ఇంటికి వచ్చిన తర్వాత
అతని తండ్రి ఏమి చిక్కాయిరా అని అడిగాడు.
ఏదో నాలుగు చేపలు పట్టాను అని చెప్పాడు, తర్వాత పెద్దాయన సంచిలో చూస్తే… మూడు ఆల్చిప్పలు ఉన్నాయి. అందులో ఒక దానిని శుభ్రం చేసి నీరు పోసి చూస్తే అందులో ఆరంజ్ కలర్ ముత్యం కనిపించింది, వెంటనే ఆయన ఒరేయ్ మనకి ఇక ఏ ఇబ్బంది ఉండదు ఈ ముత్యం చాలా ఖరీదు ఉంటుంది అని అందరికి చెప్పాడు.. అందరూ ఎంతో సంతోషించారు ఎందుకు అంటే ఆయనకు ముత్యాల గురించి బాగా తెలుసు.
7.68 గ్రాముల బరువు ఉంది ఆ ముత్యం.. మెలో మెలో అనే జీవి ద్వారా ఆ ముత్యం తయారవుతుంది. దీని ధర ఏకంగా మార్కెట్లో 4 కోట్లు ఉంటుంది అని చెప్పారట…ఇక ఇది చైనాలోని ఓ ప్రముఖ వ్యాపారి తీసుకుంటున్నారు.