తెలంగాణ ఏర్పాటు దేశ చరిత్రలోనే కీలక ఘట్టం: సీఎం కేసీఆర్

0
67

రెండో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సీఎం కేసీఆర్ ప్రసంగం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దేశ చరిత్రలోనే కీలక ఘట్టం. తెలంగాణ రాష్ట్రం కోసం విద్యార్థులు ఉద్యమం చేశారు. ఉద్యోగాలు రాలేదన్న బాధతో ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. తెలంగాణ రాష్ట్రం కోసం నేనూ లాఠీ దెబ్బలు తిన్నానని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కేవలం నీళ్లు, నిధులు, నియామకాల కోసం జరిగిందన్నారు.