ఏపీ రైతులకు అదిరిపోయే శుభవార్త..కృష్ణా డెల్టాకి సాగునీరు విడుదల

0
115

జగన్ సర్కార్ వరుస శుభవార్తలతో ప్రజలకు ఆనందపరుస్తున్నారు. జగన్ సీఎం అయిన్నప్పటి నుండి తన మార్క్ చుపెట్టుకుంటున్నాడు. అంతేకాకుండా వినూత్నమైన మార్పులు చేస్తూ ఏపీని అభివృద్ధి చేస్తున్నాడు. ప్రస్తుతం జగన్ సర్కార్ ఏపీ రైతులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. కృష్ణా డెల్టాకి ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు సాగునీరు విడుదల చేసి రైతులను ఖుషి చేశారు.

ఈ కార్యాక్రమంలో మంత్రులు జోగి రమేష్, మేరుగ నాగార్జున, విప్ సామినేని‌ ఉదయభాను, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, సింహాద్రి రమేష్, ఇరిగేషన్ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ తదితరులు కూడా పాల్గొన్నారు. కృష్ణా తూర్పు డెల్టాకి 1500 క్యూసెక్కులు, పశ్చిమ డెల్టాకి 500 క్యూసెక్కులు సాగునీటిని మంత్రులు విడుదల చేశారు.

చరిత్రలో తొలిసారిగా కృష్ణా డెల్టాకి సాగునీరు విడుదల చేసి రికార్డ్ సృష్టించింది. కృష్ణా డెల్టా పరిధిలో కృష్ణా, గుంటూరు, ప్రకాశం,పశ్చిమగోదావరి జిల్లాలు ఉండగా.. పులిచింతలలో పుష్కలంగా నీరు అందుబాటులో 35 టిఎంసిల సాగునీరు రానుంది. కృష్ణా డెల్టాకి 155 టిఎంసిల సాగునీరు అవసరమవుతుందని సాగునీటి అధికారుల ప్రస్తుతం అంచనా వేస్తున్నారు.