మన దేశంలో కొన్ని సాఫ్ట్ వేర్ కంపెనీలు తమ ఉద్యోగులకి ఉచితంగా కరోనా టీకా ఇచ్చేందుకు సిద్దం అవుతున్నాయి, దీని కోసం వైద్యశాఖ ఆరోగ్యశాఖ అధికారులతో మాట్లాడుతున్నారు… త్వరలోనే దీనిపై ప్రకటన రానుంది…అయితే
ఐటీ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్, కన్సల్టింగ్, ఔట్ సోర్సింగ్ సేవల సంస్థ యాక్సెంచర్ ఇప్పటికే దీనిపై ప్రకటన చేశాయి, దేశంలో పనిచేస్తున్న తమ కంపెనీ ఉద్యోగులకి ఉచితంగా టీకా ఇస్తాము అని తెలిపాయి.
ఉద్యోగులతో పాటు వారి కుటుంబీకులకూ వ్యాక్సిన్ అందించేందుకు ప్రయత్నిస్తామని ఇన్ఫోసిస్ కూడా ఓ ప్రకటనలో తెలిపిందని తెలుస్తోంది, ఇక ఉద్యోగులతో పాటు వారి కుటుంబంలో అందరికి టీకా ఇవ్వనున్నారు.. ఈ కరోనా సమయంలో ఉద్యోగులు అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేశారు… ఇక వర్క్ కూడా బాగా జరగడంతో కంపెనీలు లాభాల్లోనే ఉన్నాయి.
ఇక ఉద్యోగుల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని కొన్ని కంపెనీలు ఈ ఏడాది ఆరు నెలల వరకూ వర్క్ ఫ్రమ్ హోమ్ కే అనుమతి ఇచ్చారు… ప్రస్తుతం 60 ఏళ్లు పైబడిన వారికి, 45 ఏళ్లు దాటి దీర్ఘకాల అనారోగ్యంతో బాధపడుతున్న వారికి టీకాను ఇస్తున్నారు.. ఇక టీకాని చూస్తే ప్రైవేట్ ఆస్పత్రిలో 250 రూపాయలు ఒక్కోడోస్ ధర ఉంది…. ఇక మరిన్ని కంపెనీలు కూడా ఉద్యోగుల కోసం టీకా ఇవ్వాలని చర్చలు జరుపుతున్నాయట.
|
|
|
ఈ ఐటీ కంపెనీ ఉద్యోగులకి గుడ్ న్యూస్ ఉచితంగా కరోనా టీకా
-