వాహనదారులకు శుభవార్త..పెండింగ్ చలానాల రాయితీ గడువుపై సర్కార్ కీలక నిర్ణయం

0
74

వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం ఊరటనిచ్చింది. పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ చలాన్లపై మార్చి 1 నుండి 31వ తేదీ వరకు రాయితీ ఇచ్చింది సర్కార్. ఈ అవకాశాన్ని పొడిగించాలని అనేక విజ్ఞప్తులు, విశేష స్పందన రావడం వల్ల రాయితీ గడువును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. రేపటితో గడువు ముగుస్తున్న నేపథ్యంలో మరో 15 రోజుల పాటు చలాన్లపై రాయితీ గడువును పొడిగిస్తున్నామని రాష్ట్ర హోం శాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ తెలిపారు.

కాగా ఇప్పటివరకు ఈ సదవకాశాన్ని ఉపయోగించుకొని రాష్ట్ర వ్యాప్తంగా రెండు కోట్ల 40 లక్షల చలాన్లు చెల్లింపు జరిగిందని, వీటి విలువ 840 కోట్ల రూపాయలని తెలియజేశారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఇప్పటివరకు 250 కోట్ల రూపాయలు చెల్లించి పెండింగ్ చలానా క్లియర్ చేయడం జరిగిందనీ, మరియు రాష్ట్ర వ్యాప్తంగా 52% మోటారు వాహన యజమానులు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారన్నారు.

ఇంతవరకూ చలాన్లు చెల్లించలేక పోయినవారు ఈ రాయితీ అవకాశాన్ని ఉపయోగించుకుని ఈ-చలాన్ వెబ్సైట్ లో ఆన్లైన్ పేమెంట్ ద్వారా తమ చలాన్ క్లియర్ చేసుకోవాల్సిందిగా రాష్ట్ర హోం మంత్రి తెలిపారు. ఈ క్రింద విధముగా వివిధ రకాల వాహన యజమానులకు ఈ క్రింది విధముగా రాయితిని నిర్ణయించడం అయినది

2W/3W- కట్టండి 25%, మిగతా బ్యాలన్స్ 75% మాఫీ

RTC డ్రైవర్స్ కట్టండి 30%, మిగతా బ్యాలన్స్ 70% మాఫీ,

LMV/ HMV – కట్టండి 50%, మిగతా బ్యాలవ్స్ 50% మాఫ్,

తోపుడు బండ్ల వ్యాపారులు కట్టండి 2o%, మిగతా బ్యాలన్స్ 80% మాఫీ,

నో మాస్క్ కేసులు- కట్టండి Rs 100, మిగతా బ్యాలన్స్ Rs 900 మాఫీ,

బకాయిలు చెల్లింపు కోరిన మోటారు వాహన యజమనులు అన్ని విధముల ఆన్లైన్ సేవా చెల్లింపుల ద్వారా గానీ, ఈ-సేవ, మీసేవ ద్వారా గాని చెల్లించవచ్చు.