ఈ కరోనా లాక్ డౌన్ సమయంలో అసలు రైల్వే సర్వీసులు పూర్తిగా నిలిచిపోయాయి, దీంతో కాస్త మే నుంచి శ్రామిక్ రైళ్లు నడిపింది రైల్వేశాఖ.. తర్వాత పలు సర్వీసులు పరిమిత సంఖ్యలో ప్రారంభించారు, అయితే మరికొన్ని నెలల్లో పూర్తి స్ధాయిలో కరోనా తగ్గిన తర్వాత అన్నీ రైళ్లు పట్టాలు ఎక్కించాలి అని రైల్వే శాఖ చూస్తోంది.
రైల్వేశాఖ ప్రయాణానికి 5 నిమిషాల ముందు కూడా రిజర్వేషన్ సౌకర్యాన్నికల్పిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో మాదిరి కాకుండా కొత్తగా తీసుకొచ్చిన విధానంలో ట్రైన్ బయలుదేరటానికి అరగంట ముందు రెండో చార్ట్ ప్రిపేర్ చేస్తారు. రైలు కదలటానికి ఐదు నిమిషాల ముందు వరకు రిజర్వేషన్ టికెట్లను విక్రయిస్తారు.
ఈ సమయంలో ఎవరైనా చివరగా తమ ప్రయాణాన్ని క్యాన్సిల్ చేసుకుంటే ఆ టికెట్ అవైల్ బుల్ కనిపిస్తాయి, దీంతో చివరి ఐదు నిమిషాల వరకూ టికెట్ పొందే అవకాశం ఉంటుంది. అంటే ట్రైన్ కదిలే ఐదు నిమిషాల ముందు వరకూ టికెట్ చేసుకోవచ్చు. గతంలో నాలుగు గంటల ముందు మాత్రమే టికెట్ రద్దు చేసుకోవడానికి ఛాన్స్ ఉండేది.. ఇప్పుడు ఈ ఛాన్స్ 5 నిమిషాల వరకూ ఇచ్చారు.