గుడ్ న్యూస్..విద్యార్థుల ఖాతాలోకే నేరుగా డబ్బులు జమ

0
80

దళిత విద్యార్థులను ఆదుకోవడానికి కేంద్రం కొత్త  నిబంధన అమలు చేసింది. దళిత విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి సంబంధించి కేంద్రం కొత్త నిబంధన పెట్టింది. ఎస్సీ విద్యార్థులకు ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలకు సంబంధించిన ఆర్థిక సహాయాన్ని విద్యా సంస్థలకు కాకుండా నేరుగా విద్యార్థి బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని తేల్చి చెప్పింది. అప్పుడే కేంద్రం నుంచి నిధులు విడుదల చేస్తామని స్పష్టం చేసింది.

ఈ మేరకు కచ్చితమైన హామీ ఇస్తూ నిర్ణయం తీసుకొని కేంద్రానికి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. పోస్ట్ మెట్రిక్ విద్యార్థులకు ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలకు సంబంధించి ఉపకార వేతనాలను విద్యార్థి ఖాతాలో ఫీజు పేమెంట్ నిధులను విద్యార్థి పేరుతో కాలేజీ యాజమాన్యం ఖాతాలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది.

ఉమ్మడి రాష్ట్రంలో అనుసరించిన ఈ పద్ధతినే రాష్ట్రం ఏర్పాటు తర్వాత కూడా పాటిస్తోంది. అయితే కాలేజీ యాజమాన్యాలకు ఫీజులు ఇవ్వడానికి కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ ఆక్షేపిస్తోంది. ఎస్సీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు నేరుగా విద్యార్థి ఖాతాలోకే ఫీజు నిధులు ఇవ్వాలని ఆదేశించింది.