ఏపీ ప్రభుత్వం శుభవార్త..వారికీ షరతుల్లేకుండా రుణాలు మంజూరు

0
102

జగన్ సర్కార్ వరుస శుభవార్తలతో ప్రజలకు ఆనందపరుస్తున్నారు. జగన్ సీఎం అయిన్నప్పటి నుండి తన మార్క్ చుపెట్టుకుంటున్నాడు. అంతేకాకుండా వినూత్నమైన మార్పులు చేస్తూ ఏపీని అభివృద్ధి చేస్తున్నాడు. ప్రస్తుతం జగన్ సర్కార్ పేద రైతులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది.

వైఎస్సార్‌ జగనన్న కాలనీల పేరుతో రాష్ట్రవ్యాప్తంగా 30.75 లక్షల మంది పేదలకు సొంతింటి కలను నిజం చేయాలనీ లక్ష్యంతో దీనిని అమలు చేసి పేద ప్రజలను ఆనందపరుస్తున్నారు. అయితే దీనికి సంబంధించి అదిరిపోయే శుభవార్త చెప్పింది ఏపీ సర్కార్. పేదలందరి ఇళ్ల నిర్మాణానికి ఎటువంటి షరతుల్లేకుండా రుణాలు మంజూరు చేయడానికి బ్యాంకులు ముందుకు వచ్చాయి.

ఏపీ టిడ్కో, పీఎంఏవై, వైఎస్సార్‌ జగనన్న కాలనీల్లో నిర్మిస్తున్న ఇళ్లకు ఇచ్చే రుణాలను సిబిల్‌ స్కోర్‌ నుంచి మినహాయింపునిస్తూ ఆదేశాలు జారీచేసింది. కానీ అప్పటికే బ్యాంకుకు రుణం ఎగ్గొట్టిన వారికి ఈ మినహాయింపు వర్తించదని ప్రభుత్వం తెలిపింది. పేద ప్రజల ఇంటి రుణాలకు సిబిల్‌ స్కోర్‌ నుంచి మినహాయింపు ఇవ్వడంతో 1,19,968 మందికి ప్రయోజనం చేకూరే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తుంది.