ఏపీ ప్రభుత్వం శుభవార్త..త్వరలో వాటి ధరలపై కాకాని కీలక ప్రకటన

0
94

జగన్ సర్కార్ వరుస శుభవార్తలతో ప్రజలకు ఆనందపరుస్తున్నారు. జగన్ సీఎం అయిన్నప్పటి నుండి తన మార్క్ చుపెట్టుకుంటున్నాడు. అంతేకాకుండా వినూత్నమైన మార్పులు చేస్తూ ఏపీని అభివృద్ధి చేస్తున్నాడు. ఇటీవలే కొత్త క్యాబినెట్ లో కాకాని గోవర్ధన్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మంత్రి కాకాని ఏపీ రైతులకు అదిరిపోయే శుభవార్త చెప్పారు.

ఆయుల్ పామ్ ధరలపై మంత్రి కాకాని గోవర్ధన్‌ తాజాగా సమీక్ష నిర్వహించిన క్రమంలో మాట్లాడుతూ త్వరలో ఆయిల్ ఫామ్ ధరలను నిర్ణయించి వెల్లడిస్తామని ఈ మేరకు తెలియజేసారు. సీజన్ ప్రారంభానికి ముందే ఆయిల్ ఫామ్ ధరలను ప్రకటిస్తామని తెలిపారు.

ఆయిల్ ఫామ్ ధరల నిర్ణయంలో రైతులు, ఫ్యాక్టరీల యాజమాన్యాలకు ఎలాంటి నష్టం జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటామని తెలియజేసాడు. ఆయిల్ పామ్ రైతులు, కంపెనీల ప్రతినిధులు, అధికారులతో అన్ని అంశాలను చర్చించిన తరువాత ఎవరికి నష్టం చేకూరకుండా నిర్ణయం తీసుకుంటామని ఈ మేరకు తెలియజేసాడు.