పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలతో సామాన్యులు చుక్కలు చూస్తున్నారు. ఇప్పటివరకు పెరిగిన ధరలతో ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. దీనితో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో సామాన్యులకు ఊరట కలగనుంది. ఎల్పీజీ సిలిండర్ ధరను రూ.198 తగ్గించింది కేంద్రం. తగ్గిన ధరలతో ముఖ్య నగరాల్లో ధరలు ఇలా వున్నాయి.
ఢిల్లీలో రూ.2219 నుంచి రూ.2021కి పడిపోయింది.
హైదరాబాద్‌లో రూ.2426గా ఉన్న సిలిండర్ ధర రూ.2243కు చేరింది. అంటే రూ.183.50 తగ్గింది.
ఇక కోల్‌కతాలో రూ.182, ముంబైలో 190.5, ముంబైలో రూ.187 మేర తగ్గాయి.
కాగా, గత నెల 1న కమర్షియల్ సిలిండర్‌పై రూ.135 తగ్గిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే కేంద్రం నిర్ణయంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలాగే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అలాగే నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగాయని వాటిని కూడా తగ్గిస్తే సామాన్యులకు ఊరట కలుగుతుందని భావిస్తున్నారు.