గుడ్ న్యూస్: రైతులకు నెలకు రూ.2,016 పెన్షన్?

0
49

కొండపోచమ్మ సాగర్ ప్రారంభోత్సవం సందర్బంగా సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన సంచలనంగా మారింది. తెలంగాణ రైతాంగానికి త్వరలోనే అతి పెద్ద శుభవార్త చెప్పబోతున్న అని ప్రకటించడంతో రాష్ట్రం మొత్తం దాని గురించే చర్చించుకుంటున్నారు. భారతదేశమే ఆశ్చర్యపడి అడ్డం పడే వార్త అని స్వయంగా కేసీఆరే చెప్పడంతో ఆ విషయం ఏమై ఉంటుందని సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే వారం రోజుల్లో చెప్తానన్న ఆ వార్త సంవత్సరం దాటినా ఇంకా చెప్పలేదు.

తెలంగాణ రైతాంగం కోసం కేసీఆర్ ప్రభుత్వం మరో ముందడుగు వేసినట్టు తెలుస్తుంది. ఇప్పటికే రైతుల సంక్షేమం కోసం రైతుబంధు, రైతుభీమా, రుణమాఫీ, 24 గంటల ఉచిత విద్యుత్ వంటి పథకాలు రైతులకు లబ్ది చేకూర్చాయి. వ్యవసాయం అంటే దండగ కాదు పండగ అనిపించేలా సిఎం కెసిఆర్ మరిన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రానున్న బడ్జెట్‌లో అన్నదాతల కోసం సరికొత్త స్కీమ్ ప్రకటించేందుకు సిఎం కెసిఆర్ రెడీ అవుతున్నారు. రైతుల కోసం పింఛన్‌ స్కీం కోసం విధివిధానాలు రూపొందించే పనిలో ఫైనాన్స్‌ డిపార్ట్‌మెంట్‌ ఫుల్ బిజీగా ఉంది.

ఈ పథకానికి 47 ఏండ్లు నిండిన చిన్న, సన్నకారు రైతులు అర్హులు. వీరికి రూ.2,016 పింఛన్‌ ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో రైతుబంధు పథకం లబ్దిదారులు 67 లక్షల మంది ఉన్నారు. వీరిలో 47 ఏళ్లు నిండిన వాళ్లు ఎంత మంది, 49 ఏళ్లు నిండిన వాళ్లు ఎంతమంది ఉన్నారనే విషయంపై పూర్తీ వివరాలను సేకరిస్తున్నట్లు టాక్. అంతేకాదు రైతుబంధు పథకం లబ్దిదారులైన రైతులలో ఎంతమందికి భూమి ఉందని విషయంపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. మూడు నుంచి ఐదెకరాల లోపు భూమి ఉన్న రైతులకు పింఛన్‌ ఇచ్చే అవకాశాలున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. ఈ మేరకు అన్ని వివరాలను పొందు పరుస్తూ ఓ సమగ్ర వేదికను అధికారులు తయారుచేస్తున్నారు. అంతేకాదు.. అన్నదాతకు ఈ పథాన్ని అమలు చేస్తే.. ఖజానా పై ఎంత భారం పడనున్నది అనే విషయంపై కూడా దృష్టి సారించినట్లు తెలుస్తోంది.