రింగ్ రోడ్ రియల్ ‘రింగ్’ లో ప్రభుత్వమే సూత్రధారి: డా. చెరుకు సుధాకర్

0
72

రింగ్ రోడ్ రియల్ ‘రింగ్’ లో ప్రభుత్వమే సూత్రధారి అని తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షులు డా. చెరుకు సుధాకర్ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ చుట్టూ 344 కిల్లో మీటర్ల రీజినల్ రింగ్ రోడ్ అల్లైన్మెంట్ భూ సేకరణ దార్శనికతకు కేంద్ర బిందువు తెలంగాణ ప్రభుత్వంలో రింగు తిప్పుతున్నది భూ మాఫియా పెద్దలే. కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రాజెక్ట్ లు, నిధులు మంజూరు అయిన రింగ్ రోడ్డుకు అవసరమైన భూమి కంటే ఎన్నో రెట్లు రైతుల నుండి సేకరణ కోసం ఇప్పటికే ఇష్టా రాజ్యాంగ పొలాల్లో కొలుత రాళ్ళు నాటుతున్నది.

తాము కొన్న భూముల జోలికి పోకుండా రైతుల నుండి ఎక్కువ భూమి తమ అధీనంలోకి రావడానికి ప్రభుత్వ అధికారులపై కూడా ఒత్తిడి జరుగుతుంది. ఇప్పటికీ హైదరాబాద్ రింగ్ రోడ్డు చుట్టూ జరుగుతున్న అభివృద్ధిని, నిర్మాణాలను భవిషత్తు మార్కెటింగ్ చేసి భూముల రేట్లు పెంచి వచ్చిన రిజిస్ట్రేషన్ ఆదాయంతో ముందు చూపు, పొదుపు లేని దండుగ మారి పథకాలకు మళ్లించి మరోసారి రిజిస్ట్రేషన్ చార్జీల పెంపకు సిద్దమయింది కేసిఆర్ ప్రభుత్వం. ఉన్న ప్రభుత్వ భూములను వేలంలో అమ్మి సేకరించిన భూమిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి తెలంగాణ మౌలిక అభివృద్ధికి ఖర్చు పెట్టింది ఎంతనో కేటీఆర్ ట్వీట్టర్లో స్పందించి వివరించాలి.

ప్రజలను తాగుబోతులను చేస్తూ విపరీతమైన మద్యం వ్యాపారంతో ఒకవైపు రియల్ ఎస్టేట్ ‘ నిషాలో’ లేచి వచ్చిన ఆదాయంతో మరోవైపు తెలంగాణ వనరులను నిరార్ధక పనులకు వృధా చేస్తున్న తీరు పై చర్చకు ఇంటి పార్టీ సిద్దంగా ఉన్నది. ఇప్పటికే మల్లన్న సాగర్, కాళేశ్వరం కలువ పనుల్లో వేల ఎకరాల భూమి కోల్పోయిన ప్రజలకు భూ పరిహారం సరిగా అందక ఆందోళన చేస్తున్న భూ యజమానులను నిర్భందంతో అణిచివేస్తున్నది కెసిఆర్ ప్రభుత్వం.

బాధ్యత లేని రాష్ట్ర ప్రభుత్వ కుటుంబ పాలన తీరుతో నష్టపోతున్న, రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర ప్రభుత్వ నిధుల వాటా రాక రెండు విధాల నష్ట పోతున్నం. కెసిఆర్ దండుగమారి తీరు చూపి బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర వాటకు గండి కొట్టి తొండి చెయ్యాలని చూస్తున్నది. ఈ తీరుపై ప్రజాపక్షంగా అందరం పోరాడవలసి ఉన్నది.

ఇట్లు
డా. చెరుకు సుధాకర్
తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షులు