Breaking: ప‌రీక్షలను ర‌ద్దు చేసిన ప్ర‌భుత్వం

Telangana government is serious..tests canceled

0
94

పాలిటెక్నిక్ ఫైనల్ ఇయర్ క్వశ్చన్ పేపర్లు లీకయ్యాయి. హైదరాబాద్ లోని బాటసింగరంలోని స్వాతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ కాలేజి నుంచి పేపర్ లీక్ అయినట్లు అధికారులు గుర్తించారు. ప్రశ్నాపత్రాన్ని వాట్సప్ ద్వారా పంపించినట్లు తెలుస్తుంది.

పేప‌ర్ లీక్ అంశంపై తెలంగాణ ప్ర‌భుత్వం సీరియ‌స్ అయింది. లీకైన రెండు ప‌రీక్షల‌ను ర‌ద్దు చేస్తు రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఈ నెల 8, 9 తేదీల‌లో జ‌రిగిన పరీక్షలు లీక్ కావ‌డంతో ఈ రెండు ప‌రీక్షల‌ను ప్ర‌భుత్వం ర‌ద్దు చేసింది. ఈ తేదీల‌లో నిర్వ‌హించిన ప‌రీక్షల‌ను తిరిగి ఇదే నెల 15, 16 తేదీల‌లో నిర్వ‌హించాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది.