నాటుకోడి మాంసం చాలా మంది తింటారు.. ముఖ్యంగా శరీరానికి మంచిది అని చాలా మంది దీనిని ఎక్కువగా తీసుకుంటారు. కొంత మంది అంత నగదు పెట్టలేక ఫారం కోడి తీసుకుంటారు, అయితే ఇప్పుడు ఈ నాటు కోడిని తలదన్నేలా
ప్రత్యేక జాతి కోడి మార్కెట్లో ప్రవేశించింది…కడక్నాథ్ కోళ్లు ఇప్పుడు చాలా మంది ఇష్టంగా తీసుకుంటున్నారు, దీని రుచి రూపం రేటు అన్నీ డిఫరెంట్ అనే చెప్పాలి.
ఈ చికెన్ కిలో 1000 నుంచి రూ 1200 వరకు ధర పలుకుతోంది. ఇక హైదరాబాద్ అలాగే పలు ప్రధాన పట్టణాలకు ఇవి వచ్చేశాయి. ఇక్కడ విషయం ఏమిటి అంటే ఈ చికెన్ నలుపు రంగులో ఉంటుంది, ఇది ఆరోగ్యానికి మంచిది, ఇక కొవ్వు శాతం చాలా తక్కువ ఉంటుంది, దీని వల్ల ఊబకాయం సమస్య రాదు.
బతికున్న కోడి కిలో రూ.800 వరకు పలుకుతోంది. ఇక మాంసం కిలో 1000 నుంచి 1200 ధర పలుకుతోంది, ముఖ్యంగా ఈ బ్రీడ్ ఎక్కడ ఎక్కువ అంటే మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, రాజస్థాన్లలోని గిరిజన ప్రాంతాల్లో దొరుకుతుంది. వీటి గుడ్లు మాంసం కూడా ఇప్పుడు ఎక్కువగా తీసుకుంటున్నారు.