రాజన్న..నిన్ను మరవదు ఈ నేల

0
95

వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ పేరు వింటేనే పేదల ముఖాల్లో చిరునవ్వు కనిపిస్తుంది. ఏ ప్రభుత్వం తీసుకురాని సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. నేను ఉన్నాను.. అనే ఒకే ఒక్క మాటతో ఆయనను నమ్మారు ప్రజలు. పేదల కోసం, రైతుల కోసం, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన ప్రారంభించిన పథకాలు చరిత్రకెక్కాయి. ఆ పథకాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

2004లో మొదటిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజే వైఎస్సార్ రైతులకు ఉచితంగా కరెంట్ ఫైల్ మీద సంతకం పెట్టి సరికొత్త చరిత్రను తన పేరిట లిఖించుకున్నారు.

పథకాలు ఇవే..

ఇందిరమ్మ ఇళ్లు

రైతులకు ఉచిత విద్యుత్

2 రూపాయలకే కిలో బియ్యం

పావలా వడ్డీకే రుణం

వృద్ధులకు, వికలాంగుకు, నేతన్నలకు పింఛను

108 అంబులెన్స్ ఉచిత సర్వీస్

జలయజ్ఞం

విద్యార్థులకు 100 శాతం ఫీజు రీయింబర్స్ మెంట్

రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం

ఇలా చెప్పుకుంటూ పోతే..ఆయన హయాంలో తీసుకొచ్చిన ప్రతీ పథకం కూడా చరిత్రే. తెలుగు ప్రజలు ఉన్నంత కాలం.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వాళ్ల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

2009 సెప్టెంబరు 2న హెలికాప్టర్‌ ప్రమాదంలో హఠాన్మరణం చెందే వరకూ తన జీవితాన్ని ప్రజలకే అంకితం చేసిన గొప్ప నాయకుడు @ వైఎస్సార్.