ఏపీ: ఆ ఫలితాలపై హైకోర్టు కీలక తీర్పు

0
110

ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్‌-1 పరీక్షల ఫలితాలపై రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఈ మేరకు దాఖలైన పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టింది. గ్రూప్‌-1 మెయిన్స్‌ ఫలితాలను న్యాయస్థానం పక్కన పట్టింది. 3 నెలల్లోగా మాన్యువల్‌గా మూల్యాంకనం చేసి..ఆ తర్వాతే ఫలితాలు ప్రకటించాలని ఏపీపీఎస్‌సీని ఆదేశించింది.

కాగా, ఏప్రిల్‌ 28న గ్రూప్‌-1 మెయిన్స్‌ ఫలితాలను ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. డిజిటల్‌ మూల్యాంకనంతో తమకు అన్యాయం జరిగిందని పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీనితో ఆ ఫలితాలపై కోర్టు తీర్పును వెలువరించింది.