పిల్లలు పుట్టడం అంటే భార్య భర్తలు కలిసి ఈ సృష్టిలో ఓ జీవికి జన్మ ఇవ్వడం, అందుకే ఈ కాలంలో అతి జాగ్రత్తగా ఉండాలి, అంతేకాదు భార్య భర్త ఇద్దరూ ఎంతో నిష్టగా ఉండాలి, ముఖ్యంగా ఆమె కూడా అతి జాగ్రత్తలు తీసుకోవాలి, అంతేకాదు భర్త కూడా ఎంతో నిష్టగా ఉండాలి. ఈ సమయంలో భర్త చేయకూడని కొన్ని పనులు ఉన్నాయి అవి ఏమిటో చూద్దాం
1. ఆమెకి ప్రెగ్నెన్సీ అని తెలిసిన నుంచి బిడ్డ ఈ భూమి మీదకు వచ్చేవరకూ కొబ్బరికాయ కొట్టకూడదు
2. గుమ్మడికాయ పగలకొట్టకూడదు
3. సముద్రప్రయాణాలు ఒంటరిగా చేయకూడదు
4. సముద్ర స్నానాలు చేయకూడదు
5.స్మశానాలకు చివరి అంత్యక్రియల కార్యక్రమాలకు వెళ్లకూడదు
6.మరణించిన వారి పలకరింపులకి వెళ్లకూడదు
8. శృంగారంలో ఉన్న జంతువులపై దాడి చేయకూడదు
9. కుక్కలు పిల్లులకి జీవులకి ఏ హాని చేయకూడదు
10. భర్త గొడవలకు దూరంగా ఉండటం చాలా మంచిది.
11. పరాయి స్త్రీతో ఎలాంటి సంబంధం పెట్టుకోకూడదు
12.భర్త చెట్లను నరక కూడదు.
13..పాములను చంపకూడదు. వేట అస్సలు చేయకూడదు
14..భార్య కు 7 నెలలు నిండిన తర్వాత భర్త అస్సలు గడ్డం చేయించుకోకూడదు.
15. భార్యకి 7వ నెల వచ్చిన సమయం నుంచి శంకుస్ధాపన కొత్త ఇంటి నిర్మాణం చేయకూడదు