కొందరు భర్తలు భార్యలని చాలా ప్రేమగా చూసుకుంటారు..మరికొందరు ఎంతో హింసిస్తారు, ఏకంగా ఇక్కడ ఓ వ్యాపారి తన భార్యని చంపేందుకు దారుణమైన స్కెచ్ వేశాడు..తన చేతికి మట్టి అంటకుండా పగ తీర్చుకునేందుకు విష ప్రయోగాన్ని ఎంచుకున్నాడు. థాలియం అనే కెమికల్ కలిపి ఫిష్ కర్రీ చేశాడు. ఇది చాలా డేంజర్ ధాలియం అనేది ఓ స్లో పాయిజన్ లాంటిది, ఇది భార్య కుటుంబ సభ్యులకి పెట్టాడు.
చేపల కూరలో కలిసిన థాలియం మూడు నిండు ప్రాణాలను హరించింది. రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన అరోరాకు తన భార్య కుటుంబ సభ్యుల వల్ల ఓ బాధ కలిగింది.. అందుకే ఆ కుటుంబాన్ని చంపాలి అని అనుకున్నాడు..భార్యను ఆమె తల్లిదండ్రులను హతమార్చాలని నిర్ణయించుకున్నాడు.
ఓపుస్తకంలో దీని గురించి చదివాడు.. దీంతో ప్రమాదకరమైన థాలియంను ఆన్ లైన్ లో ఆర్డర్ చేశాడు. చేపల కూర వండి ఆ కుటుంబ సభ్యులకి పెట్టాడు, ఈ సమయంలో ఆ పిల్లలకు మాత్రం ఈ కూర పెట్టలేదు..భార్య, ఆమె చెల్లి, ఆమె తల్లిదండ్రులకు మాత్రమే వడ్డించాడు. చివరకు కుటుంబంలో అందరూ చనిపోయారు చికిత్స పొందుతూ…అయితే అంత కోపం ఎందుకు అంటే తన భార్య అబార్షన్ చేయించుకున్న కారణంగా ఆరు సంవత్సరాల నుంచి ఇలా కోపం పగ పెంచుకున్నాడు… తర్వాత కవలలు పుట్టినా ఆ పగ తీరలేదు, ఎంత దారుణమైన ఘటనో ఇది.
|
|
చేపల కూరతో భార్య కుటుంబాన్ని చంపేసిన భర్త – ఎంత పెద్ద స్కెచ్ వేశాడంటే
-