ప్రేమకోసం కొందరు ఏమి చేయడానికి అయినా వెనుకాడరు, ఏకంగా వారి కోసం ఎంత ఖరీదైన వస్తువులు కొంటారో తెలిసిందే, మరికొందరు చరిత్రలో నిలిచిపోయేలా నిర్మాణాలు కట్టడాలు నిర్మిస్తారు… ప్రేమికుల చిహ్నంగా తాజ్ మహల్ కూడా మనకు తెలిసిందే… ఈరోజుల్లో కొందరు చాలా వెరైటీగా తమ ప్రేమని వ్యక్తపరుస్తున్నారు.
చైనాకు చెందిన ఓ వ్యక్తి తన మాజీ ప్రియురాలి ప్రేమ కోసం ఓ ద్వీపాన్నే నిర్మించాడు.హోటేయూ గ్రామంలో ఈ ద్వీపం ఉంది ఆ స్టోరీ ఏమిటో చూద్దాం..2020 లో అతను తన ప్రియురాలితో విడిపోయాడు.. 30 ఏళ్ల షూ తర్వాత చాలా బాధపడ్డాడు, ఏదైనా తన ప్రేయసి కోసం చేయాలి అని అనుకున్నాడు ..తన సొంత గ్రామంలో ఓ ఐలాండ్ రూపకల్పన చేయాలని భావించాడు.
ఏకంగా లక్ష యువాన్లు ఖర్చు చేశాడు. రంగురంగుల పూలు ద్వీపమంతా ఏర్పాటు చేశాడు…లైట్లు బ్రిడ్జిలు ఇలా చాలా కట్టాడు..
కాని ఆమె అతని ప్రేమని యాక్సప్ట్ చేయలేదు… ఆమె అక్కడకు రానుఅంది.. అయితే ఇప్పుడు మాత్రం ఇది ప్రేమికులకి హాట్ స్పాట్ గా మారింది. ఇక్కడకు ప్రేయసిని ప్రియుడ్ని తీసుకువచ్చి చాలా మంది ప్రపోజ్ చేస్తున్నారు, ఫోటో షూట్లు చేసుకుంటున్నారు.
|
|
|
మాజీ ప్రేయసి కోసం ఐలాండ్ నిర్మించాడు కాని చివరకు ఆమె ఏం చేసిందంటే
-